Sunday, 10 April 2016

ఇద్దరు అనాధ ఆడపిల్ల @ Modukuru, looking for education support

మనవూరిలో ప్రస్తుతం ఇద్దరు అనాధ ఆడపిల్లలను గమనించటం జరిగింది ఒకరికి త్వరలోనే పెళ్ళి కుదిరింది కొంతమంది ఆ పిల్ల బంధువులు తలో చెయ్యివేసి బాధ్యత పంచుకున్నారు మన గ్రూపు వంతుగా కుట్టు మిషన్ నేర్పి ఒక మిషను అందించబోతున్నాము ఇంకొక అమ్మాయి కి తల్లి తండ్రి లేరు కొంతకాలం నానమ్మ వద్ద ఉంది ఆమె కాలధర్మంచేయటంతో అమ్మమ్మ దగ్గరికి వచ్చింది ఈ మధ్యనే ఆమె కూడా స్వర్గస్తురాలయ్యింది ప్రస్తుతం ఆమె ఇంటర్ చదువుతుంది మార్కులు కూడా బాగానే ఉన్నాయి బంధువులు కూడా ఇక మేం చదివించలేము ఇంటర్ పూర్తి అయితే ఆపేస్తాము అని చెప్పారు ప్రస్తుతం మన గ్రూపులో ఉన్న సభ్యుల సంఖ్య 250 దగ్గర దగ్గరగా ఉన్నాము తలా ఒక 100 రూపాయలు ఇచ్చినా ఆ పిల్ల 3 సంవత్సరాల చదువుకి సరిపోతుంది ఇంకా తనచేత సాయంకాలం ప్రభుత్వ పాథశాల పిల్లలకి ట్యూషన్ గాని చెప్పించినట్లయితే వూరికి ఉపకారం,ఆమెకి కూడా సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుంది.ఈ అమ్మాయి చేత బ్యాంకులో ఖాతా తెరిపించి ఆ నంబరు మీకు ఇస్తే మీరు డబ్బులు వెయ్యండి లేదా మీ పెద్దలద్వారా నాకు అందించినా నేను అందచేస్తాను.ఇలాంటి చిన్న చిన్న పనులకి ఒక సంస్థను ప్రారంభించి దానికి అధ్యక్షులు సభ్యులు అనే జాతర అనవసరం అని నా అభిప్రాయం ఒక సమస్యను గుర్తించటం దాన్ని మీ దృష్టికితేవటం మాత్రమే నా పని పరిష్కారం మీచేతుల్లోనే ఉంది దానికి యెవరో జెంటిల్మేన్ లని వెతకక్కరలేదు మీరు యెక్కడో ఉన్నా వూరిలో ఉన్న మీ సంబంధీకులద్వారా అందిచవచ్చు.
చెరుకుంపాలెం గ్రామాన్ని చూసినట్లయితే యం వి రావు అనే ఒక ఇంజనీరు పూర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని వూరి మొత్తాన్ని అభివృధ్ధి చేశారు అతను కూడా ఒకప్పుడు కొన్ని ట్రస్టులనుండి ఉపకారవేతనం పొందినవాడే.నాకు కూడా వాళ్ళని చూసినప్పుడు మన్మ్ కూడా ఇలా యెందుకు చెయ్యలేము వూరికి అనిపించి మావంతుగా విదేశాల్లో ఉన్న మితృలద్వారా చిన్నగా పని మొదలెట్టాము మీ అందరి సహకారంతో అలా ముందుకుసాగుతున్నాం మీకుకూడా దగ్గరలో యేవైనా సమస్యలు కనబడితే చెప్పండి సాధ్యమైనంతవరకు నిర్మూలిద్దాం చేయి చేయి కలిపితేనే ప్రగతి

This message copied from Modukuru In -FB
A Shiva Rami Reddy posted this.
Contact 9246984888




0 comments: